ప్రపంచం గర్వించదగిన ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. నీటి పరిరక్షణపై మక్కువతో నదులకు ఆనకట్టలు నిర్మించి దేశ ఆర్థిక పరిపుష్టికి, భారతావని ప్రగతికి బలమైన పునాదులు వేశారు.
- 7000mAh బ్యాటరీతో వస్తోన్న శాంసంగ్ గేలక్సీ M51
1884లో బొంబాయి ప్రజాపనుల విభాగంలో సహాయ ఇంజినీర్ ఉద్యోగంలో చేరిన ఆయన ప్రస్థానం ఏడు దశాబ్దాల పాటు కొనసాగింది. నీటి పరిరక్షణపై అమితాసక్తి కలిగిన విశ్వేశ్వరయ్య.. అందుకు అనుగుణంగా దేశవ్యాప్తంగా నీటి సరఫరా, మురుగునీటి పారుదల, సాగునీటి వ్యవస్థలకు రూపకల్పన చేశారు.
నిజాం నవాబు విజ్ఞప్తి మేరకు విశ్వేశ్వరయ్య ఇక్కడ డ్రైనేజీ, తాగునీటి సరఫరా వ్యవస్థలను డిజైన్ చేశారు. దీంతో ప్రమాదకర వరదల నుంచి హైదరాబాద్‌కు దాదాపుగా విముక్తి లభించింది. తిరుమల నుంచి తిరుపతి ఘాట్ రోడ్డు నిర్మాణానికి ప్లాన్ రూపకల్పనలో విశ్వేశ్వరయ్య కీలక పాత్ర పోషించారు. ఆయనను స్మరించుకుంటూ స్నేహితులు, బంధువులకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి.
Category : Uncategorized
No comments:
Post a Comment